ఆయన నాలుగు సార్లు సీఎం అయినప్పుడు... నేను నాలుగు సార్లు డిప్యూటీ సీఎం ఎందుకు కాకూడదు?: అజిత్ పవార్

  • సొంత చిన్నాన్నపై అజిత్ పవార్ చలోక్తులు
  • ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ నవ్వులు కురిపించిన అజిత్
  • 15 ఏళ్లలో నాలుగు సార్లు డిప్యూటీ సీఎం అయిన అజిత్
తన చిన్నాన్న, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నాలుగు సార్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారని... తాను నాలుగు సార్లు డిప్యూటీ సీఎం అయ్యానని అజిత్ పవార్ సరదాగా వ్యాఖ్యానించారు. పూణె జిల్లాలోని తన నియోజకవర్గం బారామతిలో ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యానించి నవ్వులు కురిపించారు. పెద్దాయన నాలుగు సార్లు సీఎం అయినప్పుడు... తానెందుకు నాలుగు సార్లు డిప్యూటీ సీఎం కాకూడదంటూ చలోక్తి విసిరారు.

గత 15 ఏళ్ల కాలంలో అజిత్ పవార్ మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా నాలుగు సార్లు బాధ్యతలను స్వీకరించారు. గత అసెంబ్లీ ఎన్నికల తర్వాతే ఆయన రెండు సార్లు డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే. తొలుత ఫడ్నవిస్ ప్రభుత్వంలో డిప్యూటీగా ప్రమాణం చేశారు. ఆ తర్వాత ఉద్ధవ్ థాకరే ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా బాధ్యతలను స్వీకరించారు.
Go Back to Shorts
Ajit Pawar
Sharad Pawar
NCP
Maharashtra

More Telugu News